పవిత్రా లోకేష్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.. నటుడు నరేష్ తో నాలుగో పెళ్ళికి సిద్ధం అంటూ వచ్చిన వార్తలతో పవిత్రా లోకేష్ పేరు బయటికి వచ్చింది.
కొన్ని రోజుల నుంచి పవిత్రా లోకేష్, నరేష్ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే! వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తున్నప్పటి నుంచీ వీళ్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. ఎఫైర్ వార్తలు తగ్గడం లేదు. కన్నడ మీడియాలో వీరి గురించి రకరకాల కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రా లోకేష్ పోలీసుల్ని ఆశ్రయించింది.…
నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌కు తను విడాకులు ఇవ్వనని మండిపడ్డారు రమ్య. అందరిముందు నరేష్‌ను పెళ్ళి చేసుకున్నానని అన్నారు. నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం సరికాదని…
కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే ఓ అపార్ట్ మెంట్…
తెలుగు సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా సినిమాగా వర్ధిల్లుతోంది. దీంతో వరల్ట్ కంట్రీస్ దృష్టి మన చిత్రపరిశ్రమపై పడింది. టర్కీలో విదేశీ చలన చిత్ర నిర్మాతలకు చిత్రీకరణ జరుపుకునే అవకాశాలతో పాటు ఆర్ధికపరమైన రాయితీలు కల్పించటానికి ఆ దేశ కాన్సులేట్ జనరల్ అందరితో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన టర్కీ కాన్సులేట్ జనరల్ ఆర్హాన్ యల్ మాన్ ఓకన్ తో మా మాజీ ప్రెసిడెంట్, విజయకృష్ణా గ్రీన్ స్టూడియో అధినేత నరేశ్ తో…
‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది. ‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్నేహితులు. ఒకే అపార్ట్ మెంట్స్ లో ఉంటారు. రుచి అనే అమ్మాయి వాళ్ళుండే అపార్ట్ మెంట్స్ లో…
పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా బెనర్జీ వంటి నటులు పలు ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన సందర్భంగా మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి…
ఆదివారం ‘మా’కు జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి మొత్తం 11 మంది గెలిచారు. ఇందులో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాగా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైప్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గెలిచిన బ్రహ్మాజీ, సుడిగాలి సుధీర్ తప్ప మిగిలిన గెలిచిన సభ్యులంతా రాజీనామా ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓటమి పాలైన జీవిత, హేమ తదితరులు కూడా హాజరయ్యారు.…
‘మా’కు జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద ప్రేమతో మూడు వందల మంది ఓటు వేసి తనను జాయింట్ సెక్రటరీగా గెలిపించారని ఉత్తేజ్ అన్నాడు. బల్బ్ ను కనుగొన్న థామస్ ఆల్వ ఎడిసన్, సినిమాను ఇచ్చిన లూమియర్ బ్రదర్స్, ‘మాయాబజార్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మార్కస్ బాట్లే…