కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు.
అయితే ఓ అపార్ట్ మెంట్ లో నరేష్ పవిత్ర ఒకే రూమ్ లో వున్నరనే వార్తతో మీడియా కవరేజ్ చేసేందుకు వెళ్ళింది. దీంతో అలర్ట్ అయిన పవిత్ర- నరేష్ లు గట్టిగా కేకలు వేస్తూ ఓ అపార్ట్‌మెంట్ లోకి వెళ్లారు. మీడియా రావడంతో.. అక్కడినుంచి లిప్ట్ లో ఎక్కిన వీరిద్దరూ .. మూడో భార్య రమ్య వైపు చూస్తూ నరేష్ విజిల్స్ వేసుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. వీరిద్దరూ పెళ్ళి చేసుకున్న విషయాన్ని రహస్యంగా వుంచింది ఈ టాలీవుడ్ జంట. ఈనేపథ్యంలో నరేష్ తల్లి విజయ నిర్మల ధరించే డైమండ్ నెక్లెస్ ను పవిత్ర కి పెళ్లి గిఫ్ట్ గా ఇచ్చాడు నరేష్. దీంతో.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలతో బయటకు వచ్చింది ఈ వ్యవహారం.