Suchendra Prasad: పవిత్రా లోకేష్ పై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, కన్నడ సీనియర్ నటి పవిత్రా లోకేష్ రిలేషన్ వివాదాస్పదమయిన విషయం విదితమే.. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందు ఎంట్రీ ఇచ్చింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరోపక్క తన భార్య మంచిది కాదని, అందుకే ఆమెను వదిలేసినట్లు నరేష్ మీడియా ముఖంగా తెగేసి చెప్పుకొచ్చాడు. ఇక ఈ నేపథ్యంలోనే సీన్ లోకి పవిత్రా లోకేష్ మాజీ భర్త సూచేంద్ర ప్రసాద్ దూసుకువచ్చాడు. పవిత్రకు రిలేషన్స్ మెయింటైన్ చేయడం అలవాటే అంటూ బాంబ్ పేల్చాడు. ఇక వీరందరిని పక్కన పెడితే.. నరేష్, పవిత్రా మాత్రం తాము స్నేహతులమని, ఒకరికొకరు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక పవిత్రా విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. సూచేంద్ర తో తనకు పెళ్లే కాలేదని చెప్పుకురావడం గమనార్హం.
ఇక ఈ క్రమంలోనే సూచేంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో పవిత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” పవిత్రకు నాకు పెళ్లి అయ్యింది.. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ మా మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం లేదు. కావాలనే మేము ఆ సర్టిఫికెట్ ను తీసుకోలేదు. ఎందుకంటే మేము ఇద్దరం విదేశీ విధానాలకు విరుద్ధం. మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించి తీసుకోలేదు. అయితే పవిత్ర నా భార్య అని నిరూపించడానికి నా నాదగ్గర ఆధారాలున్నాయి. నా పాస్ పోర్టు, ఆధార్ కార్డు గమనిస్తే ఆమె నా భార్యే అని ఉంటుంది. మేము ఇద్దరం కలిసి చాలా ఫంక్షన్స్ కూడా వెళ్ళాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూచేంద్ర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!