Pavitra Lokesh: టాలీవుడ్ హీరో నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే వార్తలతో పవిత్రా లోకేష్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వారిద్దరూ గత కొన్నేళ్లుగా కలిసే ఉంటున్నారని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారని పుకార్లు షికారు చేశాయి. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు రావడంతో వీరి మధ్య ఎఫైర్ ఉన్న విషయం బయటపడింది. అయితే నరేష్ తనకు మంచి స్నేహితుడని, తనకు తోడుగా ఉంటానని పవిత్రా చెప్పుకొచ్చింది. ఇక ఈ వివాదం దాదాపు నాలుగు రోజులు సాగుతూనే ఉంది.
ఇక ఈ వివాదం తరువాత పవిత్రాకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదని, వచ్చినా ఎవరు ఆమెను పట్టించుకోరని చెప్పుకొచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా పవిత్రా క్రేజ్ రోజురోజుకు పెరిగిపోవడం విశేషం.రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ నేడు రిలీజ్ అయిన విషయం విదితమే. ఇక ఈ సినిమాలో పవిత్రా- నరేష్ కలిసి కనిపించారు. వారిని చూసి థియేటర్లో ప్రేక్షకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫస్ట్ డే ఫస్ట్ షో లో రవితేజ ఎంట్రీకి కూడా అంత హంగామా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ జంట కనిపించింది కొద్దిసేపే అయినా పవిత్రా క్రేజ్ చూస్తే మెంటలెక్కాల్సిందే. పవిత్రా.. నరేష్ అంటూ థియేటర్లో కేకలు వేశారు అభిమానులు. ఇక దీంతో పవిత్రాకు అవకాశాలు రావడంలేదనేది పుకారు అన్నట్లు అర్ధమవుతోంది. ముందు ముందు నిరంతలు, డైరెక్టర్ లు కూడా ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అవకాశాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదిఏమైనా నరేష్ తో ఎఫైర్.. పవిత్రాకు బాగానే కలిసివచ్చిందని పలువురు అబిప్రాయపడుతున్నారు.