మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని…
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ రావటంతో అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయింది ప్రస్తుత కమిటీ. దీంతో రకరకాల వివాదాలతో సభ్యుల వ్యాఖ్యలతో ప్రజలలో చులకనువుతూ వస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లోగా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తన కమిటీతో పోటీ సిద్ధం అని ప్రకటించటం… మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు తాము కూడా అధ్యక్షపదవికి పోటీ చేస్తామని ప్రకటించటం…
‘మా’ అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. పోటీదారుల ఆరోపణలు, విమర్శలతో ‘మా’ అధ్యక్ష పోరు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్…
‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. Read Also:…
(జూన్ 7తో ‘చిత్రం భళారే విచిత్రం’కు 30 ఏళ్ళు)గిలిగింతలు పెట్టే చిత్రాలు కొన్ని, కితకితలతో మురిపించే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కొన్నిసార్లు గిలిగింతలు, కితకితలు కలిపి ఆకట్టుకొనే చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో పి.యన్.రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ‘అషి హి భన్వా భన్వీ’ అనే మరాఠీ చిత్రం ఆధారంగా ఈ ‘చిత్రం భళారే విచిత్రం’ తెరకెక్కింది. ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తూ ఈ సినిమా సాగింది. పెళ్ళికాని కుర్రాళ్ళకు ఎవరూ…