తెలుగు సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా సినిమాగా వర్ధిల్లుతోంది. దీంతో వరల్ట్ కంట్రీస్ దృష్టి మన చిత్రపరిశ్రమపై పడింది. టర్కీలో విదేశీ చలన చిత్ర నిర్మాతలకు చిత్రీకరణ జరుపుకునే అవకాశాలతో పాటు ఆర్ధికపరమైన రాయితీలు కల్పించటానికి ఆ దేశ కాన్సులేట్ జనరల్ అందరితో చర్చలు జరుపుతున్నారు.
అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన టర్కీ కాన్సులేట్ జనరల్ ఆర్హాన్ యల్ మాన్ ఓకన్ తో మా మాజీ ప్రెసిడెంట్, విజయకృష్ణా గ్రీన్ స్టూడియో అధినేత నరేశ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి. ఆదిశేషగిరిరావు, హీరోయిన్ మెహ్రీన్ కూడా పాల్గొన్నారు.