మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు.. ఎన్నికల్లో నాకు ఓటువేసి గెలిపించిన అందరికీ.. నన్ను ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. అదే సమయంలో..…
ఈరోజు ఉదయం నుంచి మా ఎన్నికలు ప్రారంభం కాగా నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు ఒకరి పై ఒకరు విరుచుకు పడుతున్నారు. ఈ వాగివివాదం నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగింది. దాదాపుగా ప్రకాష్ రాజ్ నరేష్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత…
మా ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరగడంతో తోపులాట చోటు చేసుకుంది. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇరు ప్యానళ్ల నుండి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను పిలిపించి రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే ఎన్నికలు ఆపేస్తామని, పైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానళ్ల సభ్యుల మధ్య నెలకొన్న తోపులాటలో నటి హేమ శివ బాలాజీ చెయ్యి కొరికింది అంటూ…
‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డబ్బిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు. కొందరు మంచు విష్ణు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు?…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్ తన మనసులో మాటలు బయటపెట్టేందుకు మీడియా ముందుకు వచ్చారు. జీవితా మాట్లాడుతూ.. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. “నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, హీరోగా ఎదగడం నేను చూశాను. నేను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మా ప్యానల్‌లో నాకు అపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయావు. నాకు…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ప్రమాదానికి గురైయ్యారు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. అయితే సాయి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. వైద్యానికి ఆయన స్పందిస్తున్నాడు అంటూ వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు. తేజూ ప్రమాదం గురించి తెలిసి మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన…