నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌కు తను విడాకులు ఇవ్వనని మండిపడ్డారు రమ్య. అందరిముందు నరేష్‌ను పెళ్ళి చేసుకున్నానని అన్నారు. నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం సరికాదని విరుచుకుపడ్డారు. అయితే వారికి పోలీసులు అండగా వుండడం ఏంటని రమ్య ప్రశ్నించారు. నరేష్, పవిత్ర లోకేష్ ఎలా కలిసి వుంటారో చూస్తానని రమ్య శపథం చేశారు.
కొద్ది రోజులుగా సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో.. ఆదివారం మైసూరులో నరేష్.. పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా.. రమ్య అక్కడకు చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. పవిత్ర లోకేష్‌ను చొప్పుతో కొట్టబోయింది. అయితే అక్కడే పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. నరేష్ పవిత్రను తీసుకుని విజిల్ వేస్తూ.. అక్కడనుంచి వెళ్లిపోయారు.. ఈ అంశం కాస్త చర్చకు దారి తీసింది.