Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై…
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ…
Narendra Modi : విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు…
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. Also Read:Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్…
CM Chandrababu : విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…