Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్..
- భారత్ ఎప్పటికీ అవమానాన్ని సహించదు..
- ఇండియా ఎవరికి తల వంచదు..
- మోడీకి మద్దతు ప్రకటించిన పుతిన్,..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి.
దక్షిణ రష్యాలోని సోచిలో నల్ల సముద్రం రిసార్ట్‌లో భారతదేశంతో సహా 140 దేశాల నుండి భద్రతా – భౌగోళిక రాజకీయ నిపుణుల అంతర్జాతీయ వాల్డాయ్ చర్చా వేదికలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, అది ప్రపంచ ఇంధన ధరల్ని పెంచుతుందని, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను ఎక్కువగా పెంచాల్సి వస్తుందని అన్నారు. అది యూఎస్ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Medha Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలు పెద్ద యాక్టర్ అని మీకు తెలుసా..?
డిసెంబర్ నెలలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారత్ దేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని పుతిన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారత్ దేశంతో మాకు ఎప్పుడూ సమస్యలు లేదా అంతర్రాష్ట్ర ఉద్రిక్తతలు లేవు అని పుతిన్ అన్నారు. భారత్ రష్యా నుంచి ఇంధన కొనుగోలును నిలిపేస్తే అది 9-10 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని పుతిన్ అన్నారు. అమెరికా విధించిన శిక్షాత్మక సుంకాల కారణంగా భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ద్వారా సమతుల్యం చేస్తామని ఆయన చెప్పారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి, రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు మరియు మందులను కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు. అమెరికాకు రష్యా అణు ఇంధనాన్ని సరఫరా చేస్తోందని, భారత్ తమ నుంచి ఆయిల్ కొంటే తప్పేంటని పుతిన్ యూఎస్ ద్వంద్వ నీతిని ఎత్తిచూపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..