PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు.
Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్పో” కొనసాగుతుంది.
PM Modi: భారతదేశంలో అధునాతన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈరోజు నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అనేక శతాబ్దాలుగా శత్రువుల దాడిని ఎదుర్కొన్న భారతదేశానికి "నిజమైన స్వాతంత్ర్యం" మాత్రం అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన తర్వాతే వచ్చిందన్నారు.
Naval Ships: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను రేపు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
Z-Morh Tunnel: జమ్మూ-కశ్మీర్ లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు.
రష్యా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా భవిష్యత్తు యుద్ధంలో కాదని.. బుద్ధుడిలో ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారని ఆయన గుర్తు చేశారు.
గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు…
Narendra Modi Vizag Tour Live Updates : ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఎయిర్పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ…