Donlad Trump: ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య ప్రపంచ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ట్రంప ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్‌కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం మూడు వారాల్లోనే తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే అమెరికా విదేశాంగ విధానానికి కొత్త మలుపు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దౌత్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చూపించారు.
PM Modi: పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు.
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారమే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.
తాజాగా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వేవ్స్ 2025 నిర్వహించనున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రోత్సహించేందుకు “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1” ప్రారంభించనున్నారు. నవంబర్‌లో గోవాలో…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు.…
డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్ధిని.. చివరికి మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్ధిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ వేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలింది.. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.. విద్యార్ధిని స్వస్థలం…