ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రైతులకు ఊరట కల్గించేలా ఈ మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
కేదార్‌నాథ్ రోప్ వే..
విరాసత్ బి వికాస్ బి పథకం కింద పర్వత్ మాలలో భాగంగా తొలి ప్రాజెక్టుగా కేదార్‌నాథ్ రూప్ వే పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణం కోసం 4.081 కోట్ల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తరాఖండ్ లో హిమ కుండ్ సాహిబ్ రోప్ వే నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12.4 కిలోమీటర్ల రోప్ వే కు 2.730 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
రైతులకు గుడ్‌న్యూస్..
రైతు సంక్షేమం కోసం పశువుల ఆరోగ్యం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది.. ఇందు కోసం 3 880 కోట్ల రూపాయలను కేంద్ర క్యాబినెట్ కేటాయించింది. ఈ ప్రోగ్రాం కింద పశువులకు వ్యాక్సిన్ వేయడంతో పాటు, తక్కువ ధరకే మందులు అందించేందుకు పశు ఔషధ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. ఈ పథకంలో భాగంగా.. టీకాలు వేయడం, నిఘా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పశువుల వ్యాధుల నివారణ, నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఈ పథకం ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. రైతులకు ఉపాధిని సృష్టిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. వ్యాధుల భారం కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చేస్తుంది.