ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు సోమనాథ్ ఆలయాన్ని మోడీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, శివుడికి జలాభిషేకం నిర్వహించారు. ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వచ్చారు. తన పర్యటనలో రెండవ రోజు సోమనాథ్ ఆలయానికి చేరుకుని, అక్కడ ప్రార్థనలు చేసి, ఆ తర్వాత జునాగఢ్‌లోని ససంగీర్‌కు బయలుదేరారు. ప్రధానమంత్రి ఈ రాత్రి జునాగఢ్‌లోని సింగ్ సదన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. సోమవారం ఉదయం గిర్ నేషనల్ పార్క్‌లో సఫారీకి వెళ్తారు.
Also Read:Goutham Tinnanuri: గౌతమ్ తిన్ననూరితో కేక్ కట్ చేయించిన విజయ్ దేవరకొండ
సోమనాథ్ ఆలయంలో పూజలు, జలాభిషేకం, ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చిత్రాలను ప్రధాని మోడీ ఎక్స్ లో పంచుకున్నారు. ‘ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్‌కు వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ఈరోజు సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి భారతీయుడి శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం నేను ప్రార్థించాను. ఈ ఆలయం మన సంస్కృతి, వారసత్వాన్ని, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
I had decided that after the Maha Kumbh at Prayagraj, I would go to Somnath, which is the first among the 12 Jyotirlingas.
Today, I felt blessed to have prayed at the Somnath Mandir. I prayed for the prosperity and good health of every Indian. This Temple manifests the timeless… pic.twitter.com/oERc1rq9Z8
— Narendra Modi (@narendramodi) March 2, 2025