PM Modi: దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
తాజాగా, వీరిద్దరు నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 ద్వారా ఐఎస్ఎస్ నుంచి భూమి మీకు వచ్చేందుకు 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మేరకు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి ప్రధాని నరేంద్రమోడీ లేఖ రాశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రధాని లేఖను పంచుకున్నారు. ఈ లేఖని మార్చి 1న ప్రధాని మోడీ రాశారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్‌ని కలిసినప్పుడు సునీతా విలియమ్స్ శ్రేయస్సు గురించి విచారించినట్లు ప్రధాని చెప్పారు. ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన మీటింగ్‌లో కూడా ప్రస్తావన వచ్చినట్లు లేఖలో మోడీ గుర్తు చేసుకున్నారు.
Read Also: Nagpur Violence: నాగ్‌పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
‘‘మీ పట్ల, మీ పని పట్ల మేము ఎంతో గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. ఈ సంభాషన తర్వాత నేను మీకు లేఖ రాయకుండా ఉండలేకపోయాను’’ అని ప్రధాని అన్నారు. ‘‘1.4 బిలియన్ల భారతీయులు మీ విజయానికి ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తుంటారు. ఇటీవల పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలని మరోసారి ప్రదర్శించాయి’’ అని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ప్రపంచం ఎదురుచూస్తోందని, మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలు మీకు దగ్గరగా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు.
‘‘దివంగత దీపక్‌భాయ్ ఆశీస్సులు కూడ మీకు ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ప్రధాని అన్నారు. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ భాయ్ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కి చెందిన వారు. ఆయన 2020లో మరణించారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతా విలియమ్స్, ఆమె తండ్రిని కలిసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. సునీతా విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత, భారత్ రావాలని ఆయన కోరుకున్నారు.