ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ..
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు.
పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్లు అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని వెల్లడించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును…