Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్‌లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్…
నరసరావుపేటలో ఓ యువతి కడుపులో నుంచి పెన్నులు బయటకు తీశారు వైద్యులు.. నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో ఆస్పత్రికి చేరిన యువతకి.. అనుమాతంలో సిటీ స్కాన్ చేశారు వైద్యులు.. దీంతో, కడుపులో పెన్నులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు పిల్లలు చెరువులో పడి గల్లంతయ్యారు. వారికోసం చెరువులో దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. లభ్యమయ్యారు. ఒడ్డుకు తీసుకొచ్చి చూసేసరికి వారు చనిపోయి ఉన్నారు. 24 వార్డుకి చెందిన సంతోష్, వెంకట సుధీర్ అనే ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు.
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నరసరావుపేట JNTU కాలేజీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా ఏజెన్సీస్ 24వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని గోవిందరావు రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు సత్యా ఏజెన్సీస్ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు.