అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆల్లర్లలో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలించి విచారణ అనంతరం నర్సరావుపేట టూటౌన్ పోలీస్…
గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనకు సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. Read…
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్‌చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం…
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా భావించిన ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పార్టీ గెలుపు రుచి చూడలేదు. పల్నాడు రాజకీయాలకు కేంద్రమైనా టీడీపీ నెగ్గుకు రాలేని పరిస్థితి. అందుకే స్థానిక తెలుగు తమ్ముళ్లు కొత్త పాట పాడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరస ఓటములతో నరసరావుపేటను విడిచిపెట్టిన కోడెల ఫ్యామిలీ..! గుంటూరు జిల్లా నరసరావుపేట.. పల్నాడు పౌరుషాలకు రాజకీయ వేదిక. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ ఆధిపత్యం. వరసగా అనేక పర్యాయాలు కోడెల…