Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే, రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానినీ తీసుకొచ్చారు. కర్నూలు జైలులో ఉన్న అతడ్ని విజయవాడలోని భావానీపురం పోలీసులు పిటి వారెంట్ పై తీసుకువెళ్లి అరెస్టు చేయగా.. మేజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు.
Read Also: Vishnu : ‘కన్నప్ప’నుంచి రానున్న రెండో పాట..ఎప్పుడంటే?
అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను దూషించారని ఆదోని ట్రీ టౌన్ లో నమోదైన కేసులో అరెస్టై కర్నూలు జైలులో పోసాని కృష్ణ మురళి ఉన్నారు. రేపు పోసాని బెయిల్ పిటిషన్ పై కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కస్టడీ కోరిన ఆదోని పోలీసుల పిటిషన్ పై తీర్పును మేజిస్ట్రేట్ రిజర్వు చేయగా.. పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.