ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ…
పెట్రోల్ ధరలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని చురకలు అంటించారు. read also…
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్పై హాట్ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… విశాఖ, యలమంచిలి భూసర్వే బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షమైనా, నాయకుడైనా సద్విమర్శలు చేయాలని సూచించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకు ఇష్టం ఉండదన్న ఆయన.. వాళ్లకు ఏ జ్ఞానం ఉండదు… వాళ్ల కంటే గ్రామాల్లో ఉండే సామాన్యులు బెటర్ అంటూ సెటైర్లు వేశారు.. పవన్ కల్యాణ్ మంచి…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు లోకేష్. కరోనా మహమ్మారి నేపథ్యంలో 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని కోరారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు పరీక్షా క్యాలెండర్లు విడుదల చేశాయని పేర్కొన్న లోకేష్…. లక్షల మందికి సామూహికంగా ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదమని పేర్కొన్నారు. read also…
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. అతని తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర…
నారా లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పేర్నినాని… ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్ది అని మండిపడ్డ ఆయన.. ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి… మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు.. కానీ, వాళ్లని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి పేర్నినాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..…
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపూర్ కర్నూలు కడప జిల్లాలో వర్గాలు ఉంటాయి పార్టీలు చూడరు. పాత రోజుల్లో కక్షల పెట్టుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఫ్యాక్షనిజం ఈ మూడు జిల్లాలలో ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్న లోకేష్ ని నువ్వు ఎవడివిరా అని అడుగుతున్నా… నువ్వు ఒక బచ్చావి నీకు అసలు తెలుగు మాట్లాడటం సరిగా రాదు. నువ్వు పోటీ చేసిన ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా…
నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. కర్నూల్ లో జగన్ గురించి మాట్లాడిన వాళ్ళకు చెబుతున్నా.. గడ్డం పెంచుకుని గట్టిగా మాట్లాడితే అంతకన్నా సౌండ్ వస్తుంది ఇక్కడి నుంచి అని హెచ్చరించారు. దేనికీ భయపడం, ఒంట్లో భయం లేదు, ట్రోల్స్ చేసుకో నీకు ఇష్టం వచ్చినట్లు అని పేర్కొన్నారు. చిటిక వేస్తే వైసిపి నాయకులు ఊర్లో తిరగలేరు అన్నావని.. రాష్ట్రంలో నీకు ఇష్టం వచ్చిన ఊర్లో చిట్టికి వెయ్యి దమ్ముంటే అని సవాల్…
నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఇది రాజకీయ ఘటన కాదు. ఘటనకు కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు. Read Also…