తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆక్సిజన్ కొరతతో ఏపీలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని… ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని మండిపడ్డారు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంతో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష…
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు..…
పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా…
ముందు ప్రకటించినట్టుగానే అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్ ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకు గానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి పాత్ర లేదని లోకేష్ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్రెడ్డి బయటికి రాలేదని అన్నారు. చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదని అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది…
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్నది. ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతిలోనే ఉంది పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. నారా లోకేష్ విన్నూతంగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా అలిపిరిలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… తమ…