Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు లోకేష్.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నారా లోకేష్‌ను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదే సమయంలో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వచ్చే నెల 4వ తేదీ వరకు వాయిదా వేసింది హైకోర్టు.. శుక్రవారం ఉదయమే బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన అనంతరం ఈ ఆదేశాలిచ్చింది హైకోర్టు. ఇక, ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను అక్టోబర్ 4వ తేదీ వరకు వాయిదా వేసింది హైకోర్టు.