హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖండన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిపై తీర్మానాలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని లోకేశ్ తెలిపారు.
నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన ఈ తొలి జేఏసీ సమావేశం జరుగనుంది.
రేపు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలోనే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.
దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో తెలుగు దేశం- జనసేన పార్టీలు తొలిసారి సమావేశం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.
టీడీనీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి సతిమణీ నారా భువనేశ్వరిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు