TDP PAC Meeting: ఓటరు లిస్టులో అవకతవలకపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు.. కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసిన టీడీపీ ఇప్పుడు జాతీయస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఈ రోజు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.. ఆ సమావేశంలో ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు.. వైఎస్ జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని భావించింది పీఏసీ. ఇసుక, మద్యం, కరవు, ధరలు, ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఇక, నియోజకవర్గాల వారీగా టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా రేపటి జేఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ పీఏసీ సమావేశం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేలా దళిత గౌరవ సభ పేరుతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని టీడీపీ పీఏసీలో నిర్ణయించారు. ఈ ప్రభుత్వంలో వివిధ సామాజిక వర్గాల వారు ఏ విధంగా నష్టపోయారనే అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని డిసైడైంది టీడీపీ పీఏసీ.. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం పై సమావేశంలో చర్చించారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రేపటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నేతలు.