Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చంద్ర బాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రికి బీజేపీతో ఉంటాడు అని విరుచుకుపడ్డారు.. రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించిన ఆమె.. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి అన్నారు. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి ఆయన అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక, సర్వేల తర్వాత వైసీపీ అభ్యర్థుల మార్పు జరిగింది.. మరి సంక్రాంతిలోపు టికెట్లు ప్రకటిస్తానన్న చంద్రబాబు ఎందుకు చేయలేదు? అభ్యర్థులు లేకే పొత్తులు పెట్టుకొని చంద్రబాబు వెళ్తున్నాడి విమర్శించారు.
Read Also: Atal Setu: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
కుప్పంలో గెలిచే అవకాశం లేదని చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు.. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్నారని విమర్శించారు మంత్రి రోజా.. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా సీఎం వైఎస్ జగన్ ను ఏమీ చేయలేరన్నారు. ఏపీలో లేని నాయకులు అంతా ఏకమై వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను ప్రజలు రెండు చోట్ల ఒడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థం అయ్యిందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.. బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రికి బీజేపీతో ఉంటాడు అని సెటైర్లు వేశారు. సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. అభ్యర్థులను మారుస్తా అని సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పారు.. సర్వేలు ఆధారంగా టికెట్లు ఇస్తాను అని ముందే చెప్పారని గుర్తుచేశారు మంత్రి ఆర్కే రోజా..