Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం 12.45కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన…
నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ. ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్న మోదీ. అనంతరం ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం. నేడు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్. హాజరుకానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలోనే మంత్రి నారా లోకేష్. నేడు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని నారా లోకేష్ కలిసే అవకాశం.…
ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో తెలుగు ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలపగా సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఒకటి నిర్వహించారు. నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ…
Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవ్ ను శాలువతో సత్కరించారు లోకేశ్. ఇక, ఏపీ మంత్రి వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్ తో పాటు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అండర్-19 భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానాకి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్ర నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.
వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి…