Nara Lokesh: నవ్వుకుంటున్నారు.. దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి!
- ఏపీ శాసనమండలి సమావేశాలు మొదలు
- పేరు మార్చటంపై అందరూ నవ్వుకుంటున్నారు
- ఎందుకు బకాయిలు పెట్టారో చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలి సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. నిరుద్యోగ భృతి విడుదల, యువతకు ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం చేశారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు సిద్ధం అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
‘ఫీజు పోరు అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత యువత పోరు అని పేరు మార్చటంపై అందరూ నవ్వుకుంటున్నారు. అసలు వైసీపీ వాళ్లకు అయినా దేని మీద పోరాడుతున్నారో ఓ క్లారిటీ ఉండాలి. గతంలో ఫీజులు రూ.4500 కోట్లు బకాయిలు పెట్టారు.. ఇప్పుడు ధర్నా అంటారు. వారే కరెంట్ చార్జీలు పెంచారు.. మరలా వాళ్లే ధర్నా అంటారు. ఎందుకు బకాయిలు పెట్టారో చర్చకు సిద్ధమా?. ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన మాట్లాడతాం. గత ప్రభుత్వం వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దాం’ అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆపై నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకీ నినాదాలు ఆపకపోవటంతో చైర్మన్ మండలిని 10 నిమిషాలు వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!