విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని, ఎలాంటి యాప్‌ల గొడవ ఉండదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘వన్ క్లాస్-వన్ టీచర్’ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెలలోనే 16,473 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి…
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తానంటే.. సస్పెండ్ చేస్తా అని మంత్రి నిమ్మల రామానాయుడును ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ సరదాగా అన్నారు. రెస్ట్ తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని నిమ్మలను అడిగారు. అన్నా.. కొంచెం రెస్టు తీసుకోండి అంటూ నిమ్మలకు లోకేశ్ సూచించారు. మంత్రి నిమ్మల అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాన్యులా (సెలైన్ బాటిల్)తోనే ఆయన సభకు వచ్చారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ లాబీలో మినిష్టర్ లోకేశ్‌కి మంత్రి నిమ్మల ఎదురుపడగా..…
చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్‌కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు.
ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్‌పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి…
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండోరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలు చెప్పారు.…
పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారని అరెస్ట్ చేశారు.. 41 ఏ నోటీస్ ఇచ్చి వదిలే కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుందన్నారు. ఇప్పుడు నరసరావుపేట తీసుకొచ్చారు.. బాపట్ల పోలీసులు పీటీ వారెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అసలు భారత రాజ్యాంగం నడుస్తుందా? లోకేష్…
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం, డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’…
రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడంపై పలువురు పలు రకాలుగా చెప్పారు.. మా అమ్మకి ఫోన్ చేసి అభిప్రాయం అడిగా.. నీ మనసులో ఏముందో అదే మనస్పూర్తిగా ఆచరించు అని చెప్పిందని పేర్కొన్నారు. నా తల్లి కోరిక మేరకు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నాను అని మంత్రి లోకేష్ చెప్పారు.
నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే... బెదిరిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తుంటే అధికార పార్టీ సభ్యులు తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. ఆధారాలతో సహా మాట్లాడుతుంటే.. బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు..
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు.