ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ…
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్లో ఏదైనా…
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో…
ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి…
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై…
‘శ్యామ్ సింగ రాయ్’ టీం ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎక్కడ చూసినా ‘శ్యామ్ సింగ రాయ్’ సందడే కన్పిస్తోంది. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’టీంని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగింది ఓ యాంకర్. వెంటనే సాయి పల్లవి అందుకుని స్మైల్ ఇస్తూనే ఆమె ప్రశ్నకు కౌంటర్ ఇవ్వడంపై ఆమె…
నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి…
తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస్తే కంటెస్టెంట్స్ పరంగా ఆసక్తి తగ్గుతూ వచ్చిందన్నది వాస్తవం. అయితే లక్కీగా నాలుగు, ఐదు…
బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర. చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం అనేది బిగ్ బాస్ లోని అన్ని టాస్క్ ల కంటే అతి పెద్ద టాస్క్. అందులోంచి…