నేచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ యూట్యూబ్‌లో “జెర్సీ” డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. అయితే ఈ తొలగించిన సన్నివేశాన్ని చూస్తే ఇలాంటి సన్నివేశాన్ని థియేటర్లలో చూడడం మిస్ అయ్యామే అని అన్పించక మానదు. వీడియోలో నాని మామయ్య ఆయనకు రూ. 50,000 ఇచ్చి, ఉద్యోగం చేయమని చెప్తాడు. నాని ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించడంతో ఆయన కోప్పడతాడు.
Read Also : Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !
దీంతో నాని చెప్పే ఎమోషనల్ వర్డ్స్ మనసుకి హత్తుకుంటున్నాయి. నువ్వేం చేయలేవని, లూజర్ వి అని హీరో మామయ్య చెప్పినప్పటికీ, అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మొత్తానికి తీవ్రమైన భావోద్వేగాలతో నిండిన ఈ సన్నివేశం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోనిత్ కమ్రా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నాని అద్భుతమైన నటన “జెర్సీ”లో ప్రధాన హైలైట్స్.