నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు “అంటే సుందరానికి”, “దసరా” వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. “అంటే సుందరానికి” సినిమా షూటింగ్ పూర్తి కాగా, జూన్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ పై దృష్టి పెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది.
Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
ఇక ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో మాట్లాడి థ్రిల్ చేయబోతున్నాడు. నిర్మాతలు ఇటీవల రికార్డు ధరకు నాన్-థియేట్రికల్ డీల్‌ను పూర్తి చేశారు. “దసరా” నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారు. నాని సినిమాల్లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. “శ్యామ్ సింగ రాయ్”కి అతిపెద్ద డీల్ కుదిరింది.మేకర్స్ ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను రూ.35 కోట్లకు విక్రయించారు. ఇప్పుడు “దసరా” దానిని బీట్ చేసేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది.