Nandikotkur: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది చేతిలో హతమైన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. లహరి మృతికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
స్కూల్ గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం విద్యానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూలులో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మాహిన్... స్కూల్ ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి వయస్సు ఎనిమిదేళ్లు..
నందికొట్కూరులో మహిళ హత్య కేసులో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లాలో బిహారీ యువకుడు, మరొకరితో కలసి ఓ సస్పెక్ట్ షీట్‌లో ఉన్న మహిళను తుపాకీతో కాల్చి , నరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుండగా.. ఈ కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి..
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆర్థర్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగినంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని తెలిపారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. కాగా.. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డా.సుధీర్ ను అధిష్టానం ప్రకటించింది. నందికొట్కూరు నుంచి తనను తప్పించడంతో…
MLA Arthur: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపాయి.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా సంచలనంగా మారుతున్నాయి.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి 23 ఓట్లతో గెలవడం.. ఆ తర్వాత వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.. ఇక, నాకు ఆఫర్ వచ్చిందంటే.. నాకు కూడా వచ్చిందంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి.. మొన్నటికి మొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక నాకు రూ.10…
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు. నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి…
నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గతంలో జనరల్ సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడమే ఆఖరు. ఆ తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి గౌరు చరిత గెలిచారు. 2009కి వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీకి రాజీనామా చేశాక సైకిల్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎస్సీ సామాజికవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద…