MLA Arthur: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపాయి.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా సంచలనంగా మారుతున్నాయి.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి 23 ఓట్లతో గెలవడం.. ఆ తర్వాత వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.. ఇక, నాకు ఆఫర్ వచ్చిందంటే.. నాకు కూడా వచ్చిందంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి.. మొన్నటికి మొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక నాకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందనే వ్యాఖ్యానిస్తే.. ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ నాకూ ఆఫర్ వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Read Also: Vijayawada to Kuwait Flight: గుడ్‌న్యూస్.. గన్నవరం నుంచి కువైట్‌కు నేరుగా విమానం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నాకూ ఆఫర్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే ఆర్థర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందన్న ఆయన.. నా కుమారునికి ఫోన్ చేశారు.. మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు తోసిపుచ్చారని తెలిపారు.. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో మా ఇంటివద్ద పర్సనల్ గా మాట్లాడాలని గన్‌మెన్ ను సంప్రదించారని ఆరోపించారు ఆర్థర్.. గన్ మెన్ ఫోన్‌లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ వద్ద పని ఉందని, పర్సనల్‌గా మాట్లాడాలన్నారు.. ఈ టైంలో ఎందుకు ఉదయమే రమ్మన్నానని తెలిపారు. పోలింగ్ కు ముందు మరీ ఫోన్ చేశారు.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని.. పర్సనల్ గా మాట్లాడాలనంటే.. మీ ఆటలన్నీ తెలుసు అని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే, రూ.200 కోట్లు ఓవైపు.. వైఎస్ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను జగన్ ఫోటోనే తీసుకుంటాఅని చెప్పానని పేర్కొన్నారు నందికొట్కూరు ఎమ్మె్ల్యే ఆర్థర్.