School Wall Collapse: స్కూల్ గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం విద్యానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూలులో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మాహిన్… స్కూల్ ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి వయస్సు ఎనిమిదేళ్లు.. ఈ రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే ఒక్కసారిగా పిల్లలందరూ.. స్కూల్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలో ప్రధాన గేటు గోడ కూలిపోయి.. పాప మీద పడింది. దీంతో, విద్యార్థి మాహిన్ (8) అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో.. ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఎమ్మెల్యే ముందు వాపోయారు.
Read Also: TG Police Dept: తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం.. ట్రాఫిక్ విధుల్లో 44 మంది ట్రాన్స్ జెండర్లు