టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. మహేష్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ శనివారం రాత్రి తమ స్నేహితులతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. రుచికరమైన ఆహారం, సరదా సంభాషణతో శనివారం సాయంత్రం మంచి సమయాన్ని గడిపాక స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ లో మహేష్ బాబు “మహర్షి” దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో మహేష్ కు…
అందంగా మేకప్ చేయించుకోవాలని భావించే వారికి హైదరాబాద్‌లోని మహదీయ మేకప్ స్టూడియో బెస్ట్ ఛాయిస్. మహదీయ సంస్థ తమ నూతన మేకప్ స్టూడియోను హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బంజారాహిల్స్ వద్ద ఏర్పాటు చేసింది. మహదీయ సంస్థ వైవిధ్యమైన బ్రాండ్ గుర్తింపుతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినోద ప్రపంచంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. ఈ అతిథుల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటుగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, భారతీయ మోడల్, నటుడు…
దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విదేశీ ప్రయాణాలు మొదలు, ఫ్యామిలీ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత.. భర్త, పిల్లలకు అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం వారి ప్రపంచమే.. ఆమె ప్రపంచం అన్నట్లుగా మారింది. తాజాగా మహేష్ బాబు పాల్గొన్న ఓ యాడ్ షూటింగ్ కి వెళ్లిన నమ్రత అక్కడి…
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్ అనే హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స, ప్రామాణికమైనది, ప్రాచీనమైనది మరియు సాంప్రదాయమైనది మరియు దీనిని ప్రోత్సహించడం నాకు సంతోషంగా ఉంది’…
సూపర్‌స్టార్ సోమవారం 46 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక రోజున సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ పోస్ట్ చేసి ఇలా వ్రాశారు. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా…
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా గ్యాప్ తరువాత జిమ్ లో వర్కౌట్లు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్ లో నమ్రత వర్కౌట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుట్ తరువాత దిగిన ఫోటోను షేర్ చేసిన నమ్రత ‘సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామం చేయడం ఒక ఛాలెంజ్’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కరోనా…