సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. మహేష్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ శనివారం రాత్రి తమ స్నేహితులతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. రుచికరమైన ఆహారం, సరదా సంభాషణతో శనివారం సాయంత్రం మంచి సమయాన్ని గడిపాక స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ లో మహేష్ బాబు “మహర్షి” దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో మహేష్ కు ఉన్న అతికొద్ది మంది సన్నిహితులలో ఆయన ఒకరు. పిక్స్ లో మహేష్, నమ్రత, వంశీ పైడిపల్లితో పాటు పలువురు కన్పిస్తున్నారు. అందులో మహేష్ బాబు నీలిరంగు స్వెట్‌షర్ట్‌లో, నమ్రత నలుపు దుస్తులలో కన్పిస్తున్నారు. నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పంచుకుంటూ “గత రాత్రి గురించి!! సరదా సాయంత్రాలు.. మంచి సమయాలు!!” అంటూ వ్యాఖ్యానించింది.
Read Also : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్
టాలీవుడ్ లో ఆదర్శనీయమైన జంటలలో నమ్రత, మహేష్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ స్ట్రాంగ్ మెసేజ్ తో కూడిన పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ 2022 ఏప్రిల్ 1న థియేటర్‌లలో విడుదల కానుంది.