మైనర్ బాలికను "ఐ లవ్ యు" అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Wardha gang rape case: 2010లో సంచలనం సృష్టించిన ‘‘వార్ధా సామూహిక అత్యాచారం’’ కేసులో సంచలనం నమోదైంది. ఈ అత్యాచార కేసులో దోషులుగా తేలి, 10 ఏళ్లుగా జైలు శిక్ష విధించబడిన 8 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు, ఫిర్యాదుదారుడి వాంగ్మూలంలో అసమానతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది. కేసు నేపథ్యం ఇదే: జూన్ 24, 2010న తనకు ఆరోగ్యం బాగాలేదని, దీంతో ఆస్పత్రికి వెళ్లినట్లు బాధితురాలు…
Bombay High Court: తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లడంపై బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. చట్టపరమైన నిషేధం లేనప్పుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని బయోలాజికల్ తండ్రి(కన్నతండ్రి)పై కేసు నమోదు చేయలేదని తీర్పు చెప్పింది. 35 ఏళ్ల వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ బాలిక వీపు, తలపై చేయి కదిలించడం ఆమె నిరాడంబరతను అతిక్రమించినట్లు కాదని, 28 ఏళ్ల యువకుడి శిక్షను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.