Bombay High Court: బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లడంపై బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. చట్టపరమైన నిషేధం లేనప్పుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని బయోలాజికల్ తండ్రి(కన్నతండ్రి)పై కేసు నమోదు చేయలేదని తీర్పు చెప్పింది. 35 ఏళ్ల వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంజ్ అక్టోబర్ 6 నాటి తన ఉత్తర్వుల్లో, ఏ కోర్టు ఆదేశం ద్వారా ఎలాంటి చట్టబద్ధమైన నిషేధం లేప్పుడు, తండ్రితో పాటు తల్లి కూడా చట్టబద్ధమైన సంరక్షకులని, అందువల్ల పిల్లాడిని తల్లి వద్ద నుంచి తీసుకెళ్లినందుకు కేసు నమోదు చేయరాదని పేర్కొంది.
Also Read
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
Read Also: Rajasthan: ఎన్నికల ముందు కాంగ్రెస్ చీఫ్ కుమారుడికి ఈడీ సమన్లు..
గార్డియన్ అనే వ్యక్తీకరణ మైనర్‌ని చూసుకునే ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది, కాబట్టి మా దృష్టిలో చట్టపరమైన నిషేధం లేనప్పుడు, తన సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే నేరానికి తండ్రిపై కేసు నమోదు చేయబడదరిన కోర్టు పేర్కొంది. కన్నతండ్రి బిడ్డను తల్లి కస్టడీ నుంచి తీసుకెళ్లడం వల్ల బిడ్డను ఒక సహజ సంరక్షకుడి కస్టడీ నుంచి మరొకరు తీసుకెళ్లడం మాత్రమే అవుతుందని చెప్పింది.
2023 మార్చి 29న తన మూడేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై అమరావతి పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరు అప్పటికే విడిపోయారు. అయితే ఈ కేసులో సదరు వ్యక్తి తాను బిడ్డకు తండ్రినని, సహజ సంరక్షుడినని, తనపై కిడ్నాప్ కేసు నమోదు చేయలేమని చెప్పారు. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మైనర్ పిల్లాడి సహజ సంరక్షుడి నిర్వచనాన్ని కోర్టు ప్రస్తావించింది. హిందూ మైనర్‌కి తండ్రి సహజసంరక్షకుడని, అతని తర్వాత తల్లి అని పేర్కొంది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!