ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్…
ప్రస్తుతం సినిమా తన పోకడను మారుస్తుంది. ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు హీరోహీరోయిన్లు ససేమిరా అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాలి కాబట్టి.. అయితే ప్రేక్షకులు సైతం ఆలోచన విధానాన్ని మార్చుకొని సినిమాను సినిమాలా చూడడం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇక కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ కి సిద్ధం అంటున్నారు. నాగార్జున,నాని, రవితేజ లాంటి వారు కూడా కుర్ర హీరోయిన్లతో పెదవులు కలుపుతున్నారు. అయితే…
గత ఏడాది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ విషయాలలో అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త ఒకటి. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం సామ్ ట్రోలింగ్ బారిన పడడం.. ఆమె దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే విడాకుల తరువాత నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ సమంత గురించి, విడాకుల గురించి నోరు విప్పింది లేదు. కాగా, ఇటీవల చై మొదటిసారి…
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో మెరవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల్ పోస్టర్ లో నాగ్, చైతూ మధ్యన ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది చిట్టి. తాజాగా ఈ…
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మూవీ ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య అదరగొట్టాడు. తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాట ఊర మాస్ సాంగ్ అని తెలుస్తోంది. పార్టీ సాంగ్ ఆఫ్…
బిగ్ బాస్ 5 సీజన్ ముగింపుకు వస్తుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. విన్నర్ కాండిడేట్ అంటూ ప్రచారం జరిగిన యాంకర్ రవి 12వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ కావటంతో అది మరింత ఆసక్తికరంగా మారింది. అసలు రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ అతడి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులోకి రాజకీయ శక్తులు కూడా ఎంటర్ అవటానికి ట్రై చేస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్లే, తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. ఇంకో…
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ఘటనలపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో తరచుగా గొడవ పడుతున్న షణ్ముఖ్, సిరి జంటపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో వీళ్లిద్దరినీ నాగార్జున కన్సెషన్ రూంకు పిలిపించుకుని మట్లాడారు. వాష్‌రూంకి వెళ్లి తనను తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా అని ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నకు స్పందించిన సిరి … ‘ఏమో సర్……
టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ…
(అక్టోబర్ 4న నిన్నే పెళ్ళాడతాకు 25 ఏళ్ళు) ప్రతిభను గౌరవించడం అన్నది నాటి అగ్రకథానాయకులు యన్టీఆర్, ఏయన్నార్ కు ఉండేది. వారి సొంత చిత్రాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. అదే తీరున తరువాతి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజు వంటివారు కూడా సాగారు. అక్కినేని నటవారసుడు నాగార్జున సైతం తాను నిర్మించిన చిత్రాల ద్వారా అనేకమందికి అవకాశాలు కల్పించి, చిత్రసీమలో వారు నిలదొక్కుకొనేలా చేశారు. దర్శకుడు కృష్ణవంశీ తొలి చిత్రం గులాబీ చూడగానే, నాగార్జున…