అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో మెరవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల్ పోస్టర్ లో నాగ్, చైతూ మధ్యన ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది చిట్టి.
తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ” నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు.. మాకెవ్వరు కొనిస్తారు కోకా బ్లౌజు” అంటూ నాటు భాషలో.. ఊర మాస్ స్టెప్పులతో కనిపించింది. “వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా” అంటూ సాగిన ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటోంది. డిసెంబర్ 19 న ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సాంగ్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మారుతోందని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.