Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
- ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఘాతుకం
- ఆస్పత్రిపై దాడి.. 408 మృతి
- పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
- పిరికిపంద.. అమానుష దాడిగా ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఘాతుకానికి పాల్పడింది. సోమవారం రాత్రి కాబూల్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 408 మంది మరణించిగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది.
పాకిస్థాన్ చర్యను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్యగా.. అమానుష దాడిగా అభివర్ణించింది. ఇది హేయమైన.. దురాక్రమణ చర్యగా పేర్కొంది. ఇది కచ్చితంగా ఆప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దారుణమైన దాడిగా తెలిపింది. ఇది ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగించిందని భారత్ ధ్వజమెత్తింది.
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం శాంతి, కరుణతో గడిపే పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ ఇలాంటి దాడి చేయడం హేయమైన చర్యగా భారత్ అభివర్ణించింది. ఒక ఆస్పత్రిని.. రోగులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతమూ.. ఏ చట్టమూ సమర్థించదని పేర్కొంది. ఈ నేరపూరిత చర్యను అంతర్జాతీయ సమాజం ఖండించాలని.. పాకిస్థాన్ ఘాతుకం ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విపత్కర సమయంలో ఆప్ఘని ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భారత్ ఆకాంక్షించింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 9 గంటలకు కాబూల్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడి జరిగిందని.. ఈ దాడిలో 2,000 పడకల ఆస్పత్రిలోని చాలా భాగాలు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాత్ తెలిపారు. 400లకు పైగా చనిపోయారని.. సుమారు 250 మంది గాయపడినట్లు సమాచారం అందిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్ చరిత్ర..!
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!