టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి సీక్వెల్ గా రాబోతున్న చిత్రం ‘బంగార్రాజు’.
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘లడ్డుందా’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేస్తూ పూర్తి పాటను నవంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రోమో లో నాగార్జున స్వర్గంలో దేవా కన్యలతో కలిసి చిందులు వేయనున్నట్లు కనిపిస్తోంది. తండ్రి ఏఎన్నార్ గెటప్ లో నాగార్జున అదరగొట్టేసాడు. ఇక ఏ చిత్రంలో నాగ్ తో పటు నాగచైతన్య కూడా కనిపించనున్నాడు. మరి ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిసి ప్రేక్షకులకు ఎంతటి వినోదం పంచుతారో చూడాలి.