శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలకు ముందే మంచి బజ్ దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ను సెలెబ్రిట్ చేసుకోవాలనున్న చిత్రబృందం, నేడు సాయంత్రం హైదరాబాద్ లో మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు…
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది. చిత్రం ఏమంటే……
తండ్రి నాగార్జున అక్కినేనితో మరోమారు నాగచైతన్య కలసి నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించే చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలయింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కనుంది. 2016 సంక్రాంతి సందడిలో తనదే పైచేయి అని ‘సోగ్గాడే చిన్నినాయనా’ చాటుకుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ అంటే అక్కినేని అభిమానులకు పండగే మరి! పైగా ఇందులో నాగచైతన్య కూడా నాగార్జునతో కలసి నటించడమంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాయే! ఇంతకు ముందు నాగార్జున, నాగచైతన్య…
టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ తెలుగు కూడా ఒకటి. గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ చేరువయింది. బిగ్‌బాస్ సీజన్ ముగిసిన వెంటనే తరువాత సీజన్ ఎప్పుడు ఆరంభమవుతుందోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తూ, చర్చలు చేస్తోన్న అభిమానులూ ఎంతో మంది ఉన్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్ బాస్ సీజన్ 5 ప్రొమోను విడుదల చేసింది స్టార్ మా. షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ఎదురుచూపులు……
అక్కినేని నాగార్జున ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇది సినిమా కాదు. మూవీ మ్యూజియం. దీనిని ఏర్పాటు చేయాలన్నది చిరకాలంగా నాగార్జునకు ఉన్న కల అట. సినిమాలు చేయటమే కాదు వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా బాధ్యత అంటున్నారు నాగ్. తను అలా టాలీవుడ్ కి సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్రపరచటమే కాదు వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియమ్ ఏర్పాటు చేయబోతున్నానంటున్నాడు. పక్కా ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నానని,…