అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది చిత్రబృందం. ఈ మేరకు టీం అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. “లాల్ సింగ్ చద్దా” 24 డిసెంబర్ 2021 న విడుదల కానుంది.
Read Also : చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాలో పాత్రను ఆఫర్ చేయడానికి అమీర్ తనను వ్యక్తిగతంగా పిలిచినట్లు వెల్లడించాడు. “అమీర్ ఖాన్ నన్ను పిలిచి స్క్రిప్ట్ గురించి చర్చించాడు. ఆయన పిలిచాక నేను తుది చర్చల కోసం ముంబై వెళ్లాను. ఈ చిత్రం కోసం ఎంపికయ్యాను” అని అన్నాడు. నేను ఈ పాత్రకు సరిపోతానని ఆయన నమ్మకంగా చెప్పాడు. సమయం దొరికినప్పుడల్లా అమీర్ ఏఎన్నార్, ఎన్టీఆర్ పాత పాటలను వినడానికి ఇష్టపడేవారు” అని చైతన్య చెప్పుకొచ్చాడు.