సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ ప్యూర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున కూడా ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ విషయమై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రకారం ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
Read Also : ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా సూపర్ స్టార్
నాగ చైతన్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమీర్ ఖాన్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి అవకాశం ఉందని తెలుస్తోంది.