“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల 24న ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్ధమైంది. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇది కూడా వాయిదా పడిందని తాజా సమాచారం.
Read also : షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !
సెప్టెంబర్ 17 నుంచి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19కి మారుస్తున్నారట మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ రానున్నారు. అయితే ఆయన నిన్ననే “ఆచార్య” షూటింగ్ కు హాజరయ్యారు. ఈ సినిమా షూటింగ్ కారణంగా “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ను వాయిదా వేశారా ? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే విషయం తెలియలేదు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” తెరకెక్కింది.