టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నారు. జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృదా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న బాలశౌరి జనసేనలో చేరడం శుభ సూచకం అని అన్నారు. ఒక ఎంపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని తపన పడ్డారని.. కేంద్ర నిధులు వచ్చేలా ఈ రాష్ట్రానికి మంచి జరిగేలా ఎంపీ బాలశౌరి వ్యవహరిస్తారని తెలిపారు.…
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
భీమిలిలో సిద్దం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పంచింగ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం సీఎం జగన్ పొందుతున్నారు.. పరిపాలన వదిలి ప్రజలను రెచ్చ గొట్టే పని చేస్తున్నారు.
జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాగా.. ఎన్నికల నిర్వహణ జోనల్ కమిటీని 191 మందితో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపుకు రెండు నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.