ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరతగతిన పూర్తి చేస్తాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ,…
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.
Nadendla Manohar: గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతనగర్లో రౌడీ షీటర్ దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకుమాను ఇంద్రజిత్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు.
ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ వేశారు.. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉండనున్నారు.