Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకే పేరు మార్మోగిపోతోంది.. అదే సారా అర్జున్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్’ (Dhurandhar) చిత్రంలో ‘యెలినా’ పాత్రతో ఈ 20 ఏళ్ల బ్యూటీ అందరినీ మాయ చేసింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ సరసన కథానాయికగా నటించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
READ ALSO: Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
రణ్‌వీర్‌తో 20 ఏళ్ల వయసు అంతరం.. కానీ..
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ (40), సారా అర్జున్ (20) మధ్య ఉన్న 20 ఏళ్ల వయసు వ్యత్యాసంపై నెట్టింట పెద్ద చర్చే జరిగింది. అయితే, వీరిద్దరి కెమిస్ట్రీ, సారా నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ పాత్ర కోసం కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా దాదాపు 1,300 మందిని ఆడిషన్ చేయగా, చివరకు సారా తన ప్రతిభతో ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన పార్ట్ 2 (Dhurandhar: The Revenge)లో సారా మరింత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది.
ఏడాదిన్నర వయసులోనే కెమెరా ముందుకు..
సారా అర్జున్‌కు నటన కొత్తేమీ కాదు. కేవలం ఏడాదిన్నర వయసులోనే ఒక వాణిజ్య ప్రకటనతో కెరీర్ మొదలుపెట్టి, ఐదేళ్ల వయసు వచ్చేసరికి 100కు పైగా యాడ్స్‌లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 2011లో రిలీజ్ అయిన దైవ తిరుమగళ్ (నాన్న) చిత్రంలో విక్రమ్ కూతురిగా ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. తర్వాత పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ (నందిని) చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది. ‘ఏక్ థీ దయాన్’, ‘జై హో’, ‘జజ్బా’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరవ అయ్యింది.
స్టార్ నటుడి కుమార్తె..
సారా తండ్రి రాజ్ అర్జున్ ఇండియాన్ సినిమాలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు. ముఖ్యంగా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్రకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన నటనను సారా పుణికిపుచ్చుకుంది. కేవలం 20 ఏళ్ల వయసులోనే సారా అర్జున్ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. పలు నివేదికల ప్రకారం.. ఆమె తన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘ధురందర్ 2’ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఆమె రేంజ్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
READ ALSO: Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!
తాజావార్తలు
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!