జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాగా.. ఎన్నికల నిర్వహణ జోనల్ కమిటీని 191 మందితో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపుకు రెండు నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
పార్టీలో సీటు వచ్చినా.. రాకపోయినా అభ్యర్ధి గెలుపు కోసం పనిచేయాలని నాదెండ్ల సూచించారు. మరోవైపు.. ఈ నెలాఖరు నుంచి ఏపీలో అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పవన్ సమావేశాలు పెడతారని అన్నారు. ప్రతి రోజూ పవన్ మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Read Also: YS Sharmila: బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతిస్తున్నాయి..